
ప్రముఖ గాయని పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. చికిత్సకోసం ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యు లు తెలిపారు. గత కొంత కాలంగా సుశీల అనారోగ్యంతో బాధపడుతున్న పి.సుశీల..శనివారం ఆగస్టు 17, 2024న కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. గానకోకిల పి. సుశీల త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థనలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరానికి చెందిన పి. సుశీల 1950 నుంచి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలిగా ఎదిగారు. భారతీయ సినిమారంగతో సంబంధం ఉన్న ప్లేబ్యాక్ సింగర్. ఐదు జాతీయ పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకున్న సుశీల.. ఆమె గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల పైబడి సాగిన సినీ జీవితంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడుగ, సింహళ భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడారు పి. సుశీల.