అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన ప్రధాని మోడీ

అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన ప్రధాని మోడీ

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంప్రదాయం కొనసాగించారు. రాజస్థాన్ లోని ప్రఖ్యాత అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ ను సమర్పించారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీతో కలిసి పది మంది ముస్లిం ప్రతినిధుల బృందం ఈ ఉదయం ప్రధాని మోడీని ఆయన అధికారిక నివాసంలో కలిసింది. సయేద్ మోయిన్ హుస్సేన్, షిక్జాదా అబ్దుల్ జరార్ క్రిస్టీ, ముజఫర్ ఆలీ సహా మిగతా సభ్యులతో పలు అంశాలపై మాట్లాడారు ప్రధాని. 807 ఉర్సు ఉత్సవాల సందర్భంగా మోడీ ఈ చాదర్ ను అందజేశారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీని ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న వారికి తన శుభాకాంక్షలు అందజేశారు.