మీకు పీఎం కిసాన్ డబ్బులు పడలేదా.. డోంట్ వర్రీ ఇలా చేస్తే వస్తాయి

మీకు పీఎం కిసాన్ డబ్బులు పడలేదా.. డోంట్ వర్రీ ఇలా చేస్తే వస్తాయి

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి.  కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజన పథకం కింద ఏడాదికి 6 వేల రూపాయిలు చొప్పున మూడు విడతలుగా అందిస్తోంది.  చాలామంది రైతులకు ఈ పథకం నియమ నిబంధనలు తెలియక లబ్ధిపొందలేకపోతున్నారు.  అర్హులైన రైతులందరూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలు పొందేలా  ప్రభుత్వం  ప్రతిరోజు ఏదో ఒక ప్రచారం చేస్తోంది.  ఈ క్రమంలో రైతులకు ప్రభుత్వం నుంచి రావలసిన పెట్టుబడి బకాయిలను చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. 

పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి కింద లబ్ధి చేకూరాలంటే  తప్పనిసరిగా  e-KYC చేయించాలి.  చాలామందికి దీనిపై అవగాహన లేక  e-KYC చేయించుకోకపోవడంతో పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధిని అందుకోలేకపోతున్నారు.  దీనికోసం  గ్రామీణ ప్రాంతాల్లో  రైతుల శ్రేయస్సు దృష్ట్యా100 శాతం రైతులకు పీఎం కిసాన్​ సమ్మన్​ పథకం వర్తించేందుకు  ప్రభుత్వం e-KYC కేంద్రాలను ఏర్పాటు చేసింది.  

 ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన  పథకానికి సంబంధించి 16వ ఇన్​స్టాల్​మెంట్​  ఫిబ్రవరి చివరి వారంలో ప్రధాని విడుదల చేస్తారు.   ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద భూమి సీడింగ్, ఆధార్ సీడింగ్ మరియు ఇ-కెవైసి చేయని రైతులు...  వారు సమీప CSC కేంద్రం..  PM కిసాన్ పోర్టల్ ద్వారా e-KYCని పొందాలి. పీఎం కిసాన్ యోజన కింద ప్రతి నాలుగు నెలలకు ఒక విడత విడుదల చేస్తారు.  16వ ఇన్​స్టాల్​మెంట్​  ఫిబ్రవరి లేదా మార్చి మధ్య విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు.

 పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ముందస్తు వాయిదాను పొందడానికి, రైతులు ఆధార్ .. బ్యాంకు ఖాతా సీడింగ్, సరైన భూమి పత్రాలను అప్‌లోడ్ చేయాలని వ్యవసాయ డిప్యూటీ డైరెక్టర్ అజయ్ అనంత్ తెలిపారు. లబ్ధిదారుడైన రైతు  ఇ.కె.వై.సి ద్వారా వారి సరైన పేరు నమోదు చేసుకోవాలి.  కొత్త రైతు ప్రయోజనాలను పొందడానికి అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.in లో నమోదు చేసుకోవాలి.