ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన వారికి మాత్రమే

ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన వారికి మాత్రమే

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN scheme) 11వ విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2022, మే 31వ తేదీన డబ్బులను అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని త తెలిపారు. ఈ ప్రభుత్వ పథకం ప్రయోజనం పొందాలంటే లబ్దిదారులందరూ తమ eKYVని అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. లేనిపక్షంలో ఖాతాల్లో డబ్బులు జమ కావన్నారు. జనవరి 01వ తేదీన పదో విడత నగదును విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 6 వేలను రైతులకు అందిస్తోంది. మూడు వాయిదాల్లో రూ. 2 వేల చొప్పున ఇస్తోంది. అర్హులైన రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. 

 

ఎలా తనిఖీ చేయాలి ? 

  • ముందుగా Pradhan Mantri Kisan Samman Nidhi  పోర్టల్ కు వెళ్లాలి. 
  • హోమ్ పేజీలో  Farmers Corner క్లిక్ చేయాలి. 
  • అనంతరం లబ్ది దారుల జాబితా ఉన్న దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. 
  • రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్, బ్లాక్, గ్రామ సమాచారాన్ని లబ్దిదారుడు ఎంటర్ చేయాలి. 
  • చివరిగా Get Report క్లిక్ చేస్తే జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది.

నమోదు ప్రక్రియ ఇలా

  • పీఎం కిసాన్ యోజన పథకం ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. 
  • ఇక్కడ కూడా Pradhan Mantri Kisan Samman Nidhi  పోర్టల్ కు వెళ్లాలి. 
  • Farmers Corner క్లిక్ చేయాలి. తర్వాత New Farmers Corner క్లిక్ చేసి ఆధార్ నెంబర్, రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. 
  • captcha codeను టైప్ చేయాలి. 
  • అనంతరం లబ్దిదారుడి వివరాలను ఎంటర్ చేయాలి.
  • బ్యాంకు ఖాతా, వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని ఎంట్రీ చేయాలి. 
  • సబ్మిట్ బటన్ ను క్లిక్ చేయాలి. 
  • ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ ఇచ్చే దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి.

మరిన్ని వార్తల కోసం :-

జపాన్ లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

హెల్మెట్ కంపల్సరీ.. లేకపోతే తాట తీస్తారు