తొలి విడత 10 లక్షల మందికి ‘పీఎం కిసాన్‌ ’

తొలి విడత 10 లక్షల  మందికి ‘పీఎం కిసాన్‌ ’

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వ ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ అమలుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ పనులు వేగవంతం చేసింది. ఈ నెల 24న పథకం ప్రారంభమవుతుం డటంతో తొలి విడతలో కనీసం10 లక్షల మందికి సొమ్ము జమ చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. రైతుల వివరాలను 20లోగా కేంద్రానికిచ్చేందుకు గాను దశల వారీగా అనర్హుల తొలగిస్తూ జాబితా సిద్ధం చేస్తోంది. మొదటి విడత తొలి ఫేజ్‌ లో ఐదెకరాల్లోపు భూమి ఉన్న 21 లక్షల మంది చిన్న, సన్నకారు రైతుల జాబితాను ఇప్పటికే అధికారులు గ్రామాల్లో ప్రదర్శించారు. అభ్యంతరాలు సేకరిస్తున్నారు. 21 లక్షల్లో కనీసం 90 శాతం మంది అర్హులుంటారని భావిస్తున్నారు.

రెండో ఫేజ్‌ లో కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ అర్హులున్న 3 లక్షల మంది జాబితాను, మూడో ఫేజ్‌ లో రేషన్‌ కార్డులేని 9 లక్షల మంది జాబితాను ప్రదర్శించి అభ్యంతరాలు సేకరించనున్నారు. అర్హులందరికీ సొమ్ము అందేలా చర్యలు తీసుకుంటా మని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు.