ప్రధాని మోడీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటి

V6 Velugu Posted on Dec 06, 2021

ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్,రష్యా మధ్య సంబంధం మారలేదన్నారు  ప్రధాని మోడీ. ఢిల్లీలో మోడీతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ.. గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక , రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకున్నప్పటికీ భారత్, రష్యాల స్నేహం స్థిరంగా ఉందన్నారు.  ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టంగా కొనసాగుతోందన్నారు. ఇరు దేశాల మధ్య బలమైన స్నేహబంధాన్ని కొనసాగించడంలో ప్రపంచానికి   ఆదర్శమన్నారు. తాము భారతదేశాన్ని గొప్ప శక్తిగా, స్నేహపూర్వక దేశంగా..  మిత్రదేశంగా భావిస్తున్నామన్నారు వ్లాదిమిర్ పుతిన్. తమ దేశాల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయన్నారు. 

 

Tagged hyderabad house, , PM meets Vladimir Putin, India-Russia , stronge

Latest Videos

Subscribe Now

More News