
దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ మానవాళి మంచి కోసం కృషి చేయడానికి మనలో స్ఫూర్తిని మరింతగా పెంచుతుందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. త్యాగం, సేవకు చిహ్నంగా బక్రీద్ పండుగ నిలుస్తుంది. సేవకు మనల్ని మనం అంకితం చేసుకుని దేశ శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దాం అని కోవింద్ ట్వీట్ చేశారు. కాగా మహ్మద్ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్ పండగను జరుపుకొంటారు. రంజాన్ తరువాత ముస్లింలు ప్రధానంగా జరుపుకునే పండగ ఇది.
Eid Mubarak! Greetings on Eid-ul-Adha. May this festival inspire us to work towards furthering the spirit of collective well-being and prosperity for the good of humankind.
— Narendra Modi (@narendramodi) July 10, 2022
عید الاضحی کے مقدس موقعے پر ملک کے عوام بالخصوص ہمارے مسلمان بھائیوں، بہنوں کو مبارکباد۔ عید الاضحی کا تہوار قربانی اور انسانیت کی خدمت کا درس دیتا ہے۔ آئیے اس مقدس موقعے پرانسانیت کی خدمت کے لئے خود کو وقف کریں اور ملک کی خوشحالی اور جامع ترقی کے لئے کام کرنے کا عہد کریں۔
— President of India (@rashtrapatibhvn) July 10, 2022