
హైదరాబాద్: ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు తిరస్కరించడం తెలంగాణ ప్రభుత్వ విజయమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదస్పదంగా మారిన బనకచర్ల ప్రాజెక్ట్‌పై మంగళవారం (జూలై 1) ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంబంధిత అధికారులు ఈ పీపీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్ట్‌తో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న తెలంగాణ ప్రభుత్వ వాదనలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని.. అందుకే బనకచర్ల ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు తిరస్కరించిందన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు తిరస్కరించడం తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయమని పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వాదనలు పూర్తిగా అవాస్తమని అన్నారు.
కాగా, ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. బనకచర్ల ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని ఆంధ్రప్రదేశ్‌కు తేల్చిచెప్పింది. ఈ మేరకు బనకచర్ల ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిప్పిపంపింది.
బనకచర్ల ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇవ్వాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) పరిశీలించాల్సి ఉందని.. ఈ మేరకు సీడబ్ల్యూసీని అప్రోచ్ కావాలని ఏపీకి సూచించింది. సీడబ్ల్యూసీతో కలిసి ఫ్లడ్ వాటర్ అవేలబులిటి అస్సెస్ చేయాలని పేర్కొంది. అంతరాష్ట్ర జల వివాదానికి క్లియరెన్స్ తెచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్‌కు సూచించింది.