
గత నెలలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విమానయాన చరిత్రలో అత్యంత దిగ్భ్రాంతిని కలిగించింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే పైకి ఎగరలేక కిందకు పడిపోయినట్లు ప్రాథమికంగా తేల్చారు. అయితే ఏ కారణాల వల్ల ఇలా జరిగిందనే దర్యాప్తు కొనసాగుతోంది. దీని తర్వాత కూడా ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానాల్లో వరుస ప్రమాదకర పరిస్థితులు రిపోర్ట్ కావటం ఆందోళన కలిగిస్తోంది. గతనెల ప్రమాదం తర్వాత ఇప్పటికే టిక్కెట్ బుక్కింగ్స్ కూడా మందగించాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ | రైల్వే ప్రయాణికులపై ఛార్జీల మోత..నేటినుంచే(జూలై1) టికెట్ధరలు పెంపు
అయితే గతనెల ఎయిర్ ఇండియా విమానం నేలకూలిన కొన్ని గంటల్లోనే ఢిల్లీ నుంచి వియన్నా వెళుతున్న మరో విమానం పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫైన తర్వాత ప్రయాణం మధ్యలో ఈ విమానం ఒక్కసారిగా 900 అడుగుల కిందకు వచ్చేసింది. ఎయిర్ ఇండియా 187 బోయింగ్ 777 విమానంలో చోటుచేసుకున్న ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్వాప్తు కొనసాగిస్తోంది. పైలట్లు అందించిన వివరాలు పొందిన డీజీసీఏ విమాన రికార్డర్ డేటాను తెప్పించుకుంటోంది. దీని పరిశీలన తర్వాత దర్యాప్తు ముందుకు సాగుతుందని తెలుస్తోంది.
అయితే ఈ విమానం 9 గంటలు ప్రయాణించి చివరికి సేఫ్ గా డెస్టినేషన్ చేరుకుంది. ప్రయాణాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో స్టార్ట్ చేసిన కొద్ది సేపటికే విమానం ఉన్న ఎత్తు నుంచి ఒక్కసారిగా 900 అడుగదులు కిందకు వచ్చేసింది. ఈ క్రమంలో నేలకు అత్యంత చేరువగా ప్రయాణిస్తున్నట్లు వార్నింగ్ అలార్మ్ హెచ్చరికలు పదేపదే రావటాన్ని పైలట్స్ రిపోర్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉండటంతో పైలట్లను కూడా సేవలకు ఎయిర్ ఇండియా దూరంగా ఉంచినట్లు వెల్లడైంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం జూన్ 14న జరగగా అందులో దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన రిపోర్ట్ అయిన 38 గంటలకే బోయింగ్ 777 మోడల్ ఎయిర్ ఇండియా 187 విమానంలో టెక్నికల్ సమస్య వల్ల విమానం ఒక్కసారిగా 900 అడుగుల ఎత్తు కిందకు దిగిపోవటంపై సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ అప్రమత్తం అయ్యింది. అసలు ఇలా జరగటానికి కారణం ఏంటనే విషయాలను తెలుసుకునేందుకు ఎయిర్ ఇండియా సేఫ్టీ హెచ్ నుంచి సమాధానం కోరింది. అయితే డీజీసీఏ తరుచగా ఎయిర్ ఇండియా విమానాల్లో సమస్యలు, మెయింటెనెన్స్ సరిగా చేయకపోవటం వంటి సమస్యలను గుర్తించింది.
గడచిన నెలరోజుల్లో అనేక ఎయిర్ ఇండియా విమానాల్లో టెక్నికల్ సమస్యలు రావటానికి నాశిరకంగా జరిగిన మెయింటెనెన్స్ ఒక కారణంగా డీజీసీఏ భావిస్తోంది. ప్రస్తుతం రిపోర్ట్ అయిన తప్పు టెక్నికల్ కారణాల వచ్చిందా లేక ప్రతికూల వాతావరణం వల్ల జరిగిందా, ఏవైనా సిస్టమ్స్ తప్పుడు అలార్మ్ ఇచ్చాయా, క్రూ చేసిన తప్పులేమైనా దీనికి కారణమయ్యాయా అనే వివిధ కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. మెుత్తానికి ఈ ప్రమాదంలో మరో ఎయిర్ ఇండియా విమానం నేలకు గుద్దుకునే పరిస్థితిని తప్పించుకోగలిగింది.