కాంగ్రెస్కు ఓటేస్తే.. అది నేరుగా బీఆర్ఎస్కే వెళ్తుంది: ప్రధాని మోదీ

కాంగ్రెస్కు ఓటేస్తే.. అది నేరుగా బీఆర్ఎస్కే వెళ్తుంది: ప్రధాని మోదీ

కాంగ్రెస్ కు ఓటేస్తే.. అది నేరుగా బీఆర్ఎస్ కే వెళ్తుందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకదానికొకటి జిరాక్స్ కాపీ ని ప్రధాని మోదీ అన్నారు. వారసత్వ రాజకీయలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొందని చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోందని తెలిపారు. నిర్మల్ లో బీజేపీ సకల జనుల సంకల్ప సభకు మోదీ హాజరయ్యారు. 

కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శించారు. మతం పేరుతో ఐటీపార్క్ ఏర్పటు చేస్తానని చెప్పడం దారణమన్నారు. ప్రజల సొమ్ముతో కేసీఆర్ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో తెలంగాణలో అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ కు తన కుటుంబం తప్ప ప్రజల బాగోగులు పట్టవని మండిపడ్డారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరం లేదన్నారు.

ప్రజలను పట్టించుకోని సీఎం తెలంగాణ ప్రజలకు అవసరమా అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ప్రజలను కలవని సీఎం మనకు అవసరమా అని ఓటర్లను నిలదీశారు. సచివాలయానికి వెళ్లని సీఎం మనకు అవసరమా.. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు శాశ్వతంగా ఫాంహౌస్ కు పంపించబోతున్నారని వ్యాఖ్యానించారు. 

దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని మోదీ విమర్శించారు. దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ ల హామీని విస్మరించారన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ చెప్పి స్కామ్ లు చేశారని.. తన బంధువులకు మాత్రమే కేసీఆర్ న్యాయం చేశారని ఆరోపించారు. 
 
ప్రభుత్వ ఏర్పాటును ప్రధాని మోదీ తెలుగులో ప్రస్తావించారు. బీజేపీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాబోతుందన్నారు.  గత 10 ఏళ్లలో  కుటుంబాలకు పక్కా ఇళ్లు ఇచ్చామన్నారు. తెలంగాణలో ప్రధాని అవాస్ యోజన అమలు కాలేదని.. అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్లు కల్పిస్తామన్నారు. ఉచితంగా రేషన్ ఇస్తున్నామని.. మరో ఐదేళ్ల పాటు ఈ పథకాన్ని పొడిగించామని తెలిపారు.