ఇంటర్ స్టూడెంట్ కి ప్రధాని మోడీ ఫోన్

ఇంటర్ స్టూడెంట్ కి ప్రధాని మోడీ ఫోన్

ప్రధాని మోడీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా యూపీకి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థికి ఫోన్ చేశారు. అమ్రోహా పట్టణానికి చెందిన ఉస్మాన్ సైఫీ ఈ మద్యే విడుదలయిన యూపీ ఇంటర్ ఎగ్జామ్స్ లో టాపర్ టెన్ లో ఒకడిగా నిలిచాడు. ప్రధాని నుంచి ఫోన్ రావడంతో సైఫీ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. మొదట సైఫీ అసలు నమ్మలేదు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మోడీ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులతో మాట్లాడారు. సైఫీతో పాటు.. తమిళనాడులోని నమక్కల్ కు చెందిన కనిగాతో కూడా మాట్లాడారు.

ప్రధాని మోడీ ఫోన్ కాల్ పై సైఫీ స్పందిస్తూ.. ‘నాకు చాలా సంతోషంగా ఉంది. అది మాటల్లో వ్యక్తపరచలేను. నేను ప్రపంచంలోని ఒక ఉత్తమ నాయకుడితో మాట్లాడుతున్నానని అసలు నమ్మలేదు. వేద గణితం నేర్చుకొని.. నా స్నేహితులకు కూడా నేర్పించమని మోడీ నాకు సలహా ఇచ్చారు’ అని సైఫీ తెలిపాడు.

యువతతో మాట్లాడటం వల్ల స్పూర్తి కలుగుతుందని ప్రధాని మోడీ అన్నారు. విజయాన్ని దక్కించుకున్న యువతతో మాట్లాడాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటానని ఆయన అన్నారు. దేశానికి స్పూర్తినిచ్చే యువత విజయగాథలను మాతో పంచుకోవాలిని ప్రధాని మోడీ యువతకు
విజ్ఞప్తి చేశారు.

For More News..

దేశంలో 14 లక్షలు దాటిన కరోనా కేసులు

ఇదే నా చివరి వీడియో.. వీడియో పోస్ట్ చేసి హీరోయిన్ ఆత్మహత్యాయత్నం

బస్టాండులో గుర్తుతెలియని మహిళ శవం.. శవం పక్కన..