వరల్డ్ చాంపియన్లకు పీఎం పిలుపు

వరల్డ్ చాంపియన్లకు  పీఎం పిలుపు

న్యూఢిల్లీ: వరల్డ్ చాంపియన్స్, ఇండియా విమెన్స్ క్రికెట్‌‌ టీమ్‌‌ను ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ నేరుగా అభినందించనున్నారు. బుధవారం (నవంబర్ 05) ఢిల్లీలో  విన్నింగ్‌‌ టీమ్‌‌కు పీఎం మోదీ ఆతిథ్యం ఇవ్వనున్నారు. 

ఈ  మేరకు సోమవారం (నవంబర్ 03) రోజు పీఎంఓ నుంచి బీసీసీఐకి అధికారిక ఆహ్వానం అందింది. కెప్టెన్ హర్మన్‌‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో క్రికెటర్లు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న ప్లేయర్లు మంగళవారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. ప్రధానిని కలిసిన తర్వాత వారు తమ సొంత ప్రాంతాలకు బయలుదేరుతారు.