
దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారని ఇటీవల జరుగుతున్న ప్రచారంపై ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు. మళ్లీ లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ బుధవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, సహా పలువురు ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌పై వస్తున్న వార్తల గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ప్రధాని మోడీ దేశంలో లాక్‌డౌన్ దశ ముగిసి, అన్ లాక్ దశ ప్రారంభమైందని స్పష్టం చేశారు. దేశంలో మళ్లీ లాక్‌డౌన్ ఉండబోదని, నాలుగు దశల లాక్‌డౌన్ ముగిసిందని, అన్‌లాక్ 1.0 నడుస్తోందని చెప్పారు. అన్ లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై మనమంతా చర్చించుకోవాలని అన్నారు.