
న్యూఢిల్లీ, వెలుగు: ప్రముఖ నృత్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడి కనకరాజు మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా ‘ఎక్స్’వేదికగా స్పందించారు. గుస్సాడి నృత్యానికి కనకరాజు చేసిన సమున్నతమైన సేవలను, అంకితభావాన్ని మోదీ కొనియాడారు. సాంస్కృతిక వారసత్వ చిహ్నలేవీ వాటి స్వాభావిక స్వరూపాన్ని కోల్పోకూడ దన్న కనకరాజు తపనను ప్రశంసిం చారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.