ఎర్రకోటపై మోడీ నయా హిస్టరీ.. 2024లో 98 నిమిషాలు.. ఈ సారి ఎంతసేపు మాట్లాడారంటే..?

ఎర్రకోటపై మోడీ నయా హిస్టరీ.. 2024లో 98 నిమిషాలు.. ఈ సారి ఎంతసేపు మాట్లాడారంటే..?

న్యూఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం వేళ ప్రధాని మోడీ నయా రికార్డ్ సృష్టించారు. ఎర్రకోటపై అత్యధిక సమయం (103 నిమిషాలు) పాటు ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. 79వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం (ఆగస్ట్ 15) ఎర్రకోటలో జాతినుద్దేశించి మాట్లాడిన మోడీ.. ఏకధాటిగా 103 నిమిషాల పాటు ప్రసంగించారు. తద్వారా తన రికార్డును తానే మోడీ బ్రేక్ చేసుకున్నారు. 2024, ఆగస్ట్ 15 సందర్భంగా ఎర్రకోటపై 98 నిమిషాల లాంగ్ స్పీచ్ ఇచ్చిన మోడీ.. ఈ ఏడాది ఆ రికార్డును బద్దలు కొట్టారు. 

లాస్ట్ ఇయర్ కంటే ఈ సారి 5 నిమిషాలు ఎక్కువ సేపు మాట్లాడారు. తద్వారా సుధీర్ఘ ప్రసంగాలు ఇవ్వడంలో తనకు తానే సాటి అని ప్రధాని మోడీ మరోసారి నిరూపించారు. మోడీ తర్వాత.. 1947లో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 72 నిమిషాల ప్రసంగం ఎర్రకోటపై సెకండ్ హాయొస్ట్ టైమ్ స్పీచ్. దీంతో పాటు మరో రికార్డును కూడా మోడీ బ్రేక్ చేశారు. ఎర్రకోటపై వరుసగా 12 సార్లు ప్రసంగించి.. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును తుడిచిపెట్టారు.

ఇందిరా గాంధీ వరుసగా 11 సార్లు ఎర్రకోటపై స్పీచ్ ఇచ్చారు. 103 నిమిషాల సుధీర్ఘ ప్రసంగంలో మోడీ పలు అంశాలను ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్, ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా, జీఎస్టీ, టారిఫ్స్, ఉగ్రవాదం, ఆర్ఎస్ఎస్, దేశీయ రక్షణ వ్యవస్థ బలోపేతం, సింధూ నది జలాల ఒప్పందం, యువత, నిరుద్యోగం వంటి కీలక అంశాలపై మాట్లాడారు.

గత స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలలో ప్రధాని మోడీ స్పీచ్

  • 2014: 65 నిమిషాలు
  • 2015: 88 నిమిషాలు
  • 2016: 94 నిమిషాలు
  • 2017: 56 నిమిషాలు
  • 2018: 83 నిమిషాలు
  • 2019: 92 నిమిషాలు
  • 2020: 90 నిమిషాలు
  • 2021: 88 నిమిషాలు
  •  2022: 74 నిమిషాలు
  • 2023: 90 నిమిషాలు
  • 2024: 98 నిమిషాలు 
  • 2025: 103 నిమిషాలు

  •