హిమాచల్ ప్రదేశ్లో ప్రధాని మోడీ పర్యటన

హిమాచల్ ప్రదేశ్లో ప్రధాని మోడీ పర్యటన

హిమాచల్ ప్రదేశ్ లో నాలుగో వందే భారత్ ట్రైన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇవాళ ఆయన.. ఉనా రైల్వేస్టేషన్ లో జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. వందే భారత్ రైలు ఉనా–ఢిల్లీ స్టేషన్ల మధ్య నడవనుంది. ఈ రైలు బుధవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. అంబాలా, చండీగఢ్, ఆనంద్‌పూర్ సాహిబ్, ఉనాలో ఆగుతుంది. ఇది కేవలం 52 సెకన్లలో గంటకు100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.  కాగా, ఈ కార్యక్రమంలో హిమాచల్ సీఎం జైరాం ఠాకూర్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్రమంత్రి, హమీపూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.

ఇక అంతకుముందు సీఎం జై రామ్ ఠాకూర్ ఉనా లోని పెఖుబేలా హెలిప్యాడ్ వద్దకు చేరుకొని ప్రధానికి స్వాగతం పలికారు. రాష్ట్రంలోని ఎన్నికలు జరగనున్న రెండు జిల్లాల్లో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన అనంతరం ఉనా, చంబా జిల్లాల్లో జరిగే రెండు బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగిస్తారు.