లక్ష మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన ప్రధాని మోదీ

లక్ష మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన ప్రధాని మోదీ

కేంద్రంలోని  వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన  దాదాపు లక్ష మంది అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారు. రోజ్‌గార్ మేళా చొరవలో భాగంగా ప్రధాని మోదీ ఫిబ్రవరి 12న వీడియో కాన్ఫరెన్సింగ్ సెషన్ ద్వారా  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమం ఉపాధి అవకాశాలను పెంపొందించడం,  దేశంలోని యువతకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ సందర్భంగా మోదీ న్యూఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్, కర్మయోగి భవన్ మొదటి దశకు శంకుస్థాపన చేశారు. 

రోజ్‌గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో నిర్వహించబడుతోంది, కేంద్ర ప్రభుత్వ శాఖలు,  రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిలోనూ రిక్రూట్‌మెంట్‌ను సులభతరం చేస్తుంది. కొత్తగా నియమితులైన వ్యక్తులు రెవెన్యూ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వంటి మంత్రిత్వ శాఖలలో వివిధ హోదాల్లో సేవలందిస్తారు.