దేశ భద్రత విషయంలో రాజీపడం: X ఖాతాకు ఆపరేషన్ సింధూర్ డీప్ పిక్ పెట్టిన ప్రధాని మోదీ

దేశ భద్రత విషయంలో రాజీపడం: X ఖాతాకు ఆపరేషన్ సింధూర్ డీప్ పిక్ పెట్టిన ప్రధాని మోదీ

జాతీయ భద్రత విషయంలో రాజీ పడబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడిన మోదీ.. సైనికుల ధైర్య సాహసాలను ప్రశంసించారు.జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో 26 మంది అమాయక టూరిస్టులను పొట్టన బెట్టుకున్న పాక్, పాక్ ఆక్రమితకాశ్మీర్ లో ఉగ్రవాదుల అనావాళ్లు లేకుండా చేసేందుకు ఆపరేషన్ సింధూర్  మిషన్ ప్రారంభించామన్నారు ప్రధాని. ప్రధాని మోదీ తన  X ఖాతా డిస్‌ప్లే పిక్చర్‌ను కూడా ఆపరేషన్ సిందూర్‌గా మార్చారు. 

అమాయకులను చంపిన ఉగ్రవాదులకు భారత్ తగిన బుద్ది చెప్పిందన్నారు. ‘‘ గత సంవత్సరం సరిగ్గా ఇదే  రోజు ఆపరేషన్ సింధూర్ ప్రారంభించాం.. సాయుధ దళాలు సాటిలేని ధైర్యం ప్రదర్శించి  పహల్గాంలో అమాయకపు భారతీయులపై దాడి చేసిన ఉగ్రవాదులకు తగిన బుద్ది చెప్పారని, సైనికుల శౌర్యానికి భారత్ సెల్యూట్ చేస్తుందన్నాదని   ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఉగ్రవాదాన్ని ఓడించి, దానికి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వ్యవస్థను నాశనం చేయాలనేది మా దృఢంగా సంకల్పం అని మోదీ రాశారు.