
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగానే ప్రధానమంత్రి మోదీ.. రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. 2023, నవంబర్ 25, 26 తేదీల్లో రెండు రోజులు.. మోదీ హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీలో ఈ రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు పోలీసులు.
నవంబర్ 25వ తేదీ శనివారం..
సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 50 నిమిషాల వరకు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అవేంటో చూద్దాం..
>>> బేంగపేట ఎయిర్ పోర్ట్, పీఎన్ టీ ఫ్లైఓవర్, షాపర్స్ స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంటపేట ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్, రాజీవ్ గాంధీ విగ్రహం, మోనప్ప ఐస్ ల్యాండ్ జంక్షన్, సికింద్రాబాద్ యశోధ ఆస్పత్రి, ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్, రాజ్ భవన్ ఏరియాల్లో 30 నిమిషాలపాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి.
నవంబర్ 26వ తేదీ ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
ఉదయం 10:35 గంటల నుంచి 11:05 గంటల వరకు..
>>> సోమాజిగూడ రాజ్ భవన్, యశోధ ఆస్పత్రి, మోనప్ప ఐస్ ల్యాండ్ జంక్షన్, ప్రగతిభవన్, బేగంపేట ఫ్లైఓవర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, షాపర్స్ స్టాప్, అండర్ పీఎన్ టీ ఫ్లైఓవర్, బేగంపేట వై ఎయిర్ పోర్ట్ వై జంక్షన్, బేగంపేట ఎయిర్ పోర్టు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి.
ఈ సమయాల్లో ఈ ప్రాంతాల్లోకి వెళితే అరగంటపాటు రోడ్డుపైనే ఆగాల్సి ఉంటుంది.. ట్రాఫిక్ నిలిపివేస్తారు. అర గంట ట్రాఫిక్ ఆగటం అంటే.. ఈ ప్రాంతాల్లో ఓ ఐదార గంటలు జామ్ అయినట్లే.. నిత్యం రద్దీగా ఉండే ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళితేనే బెటర్. లేదంటే తెలిసి తెలిసి ట్రాఫిక్ లో ఇరుక్కుపోవటం ఖాయం..