అటల్​ బ్రిడ్జి విశేషాలు...

అటల్​ బ్రిడ్జి విశేషాలు...

న్యూఢిల్లీ : గుజరాత్​లోని అహ్మదాబాద్​లో సబర్మతి నదిపై నిర్మించిన ‘అటల్​ బ్రిడ్జి’ ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఆయన ఆదివారం కూడా గుజరాత్​లో పర్యటించనున్నారు. మొదటి రోజు పర్యటనలో భాగంగా 300 మీటర్ల పొడవైన అటల్​ బ్రిడ్జిని ఆయన లాంచ్​ చేశారు. ఈ సందర్భంగా బ్రిడ్జికి సంబంధించిన ఫొటోలను ట్విటర్​లో ఆయన షేర్​ చేశారు. ‘‘బ్రిడ్జి అద్భుతంగా కనిపిస్తోంది కదా!. సబర్మతి నదిపై నిర్మించిన అసాధారణమైన ల్యాండ్​మార్క్​ఈ అటల్​ బ్రిడ్జి” అని మోడీ ట్వీట్​ చేశారు. మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయి పేరును ఈ బ్రిడ్జికి పెట్టారు.

బ్రిడ్జి విశేషాలు...

అహ్మదాబాద్​ మునిసిపల్​ కార్పొరేషన్​ సబర్మతి నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించింది. ఇది పూర్తిగా ఫుట్​ఓవర్​ బ్రిడ్జి. అంటే నడిచేందుకు మాత్రమే దీనిని కట్టారు. ఎల్లిస్​ బ్రిడ్జి, సర్దార్ బ్రిడ్జిల మధ్య ఈ అటల్​ వారధిని నిర్మించారు. దీని పొడవు 300 మీటర్లు, వెడల్పు 14 మీటర్లు. 2,600 మెట్రిక్​ టన్నుల స్టీల్​ పైపులు వాడి ఈ వారధి కట్టారు. బ్రిడ్జి రూఫ్​ను రంగురంగుల ఫ్యాబ్రిక్​తో తీర్చిదిద్దారు. రెయిలింగ్​ను గ్లాస్​, స్టెయిన్ లెస్​ స్టీల్​తో నిర్మించారు. రివర్​ ఫ్రంట్​లోని పశ్చిమాన ఉన్న ఫ్లవర్​ గార్డెన్​ను తూర్పున త్వరలో నిర్మించే ఆర్ట్స్​ అండ్ కల్చర్​ సెంటర్​తో ​ఈ బ్రిడ్జి కలుపుతుంది. పాదచారులతో పాటు సైక్లిస్టులు కూడా నదిని దాటేందుకు, ట్రాఫిక్​ బారి నుంచి తప్పించుకునేందుకు ఈ వారధిని వాడుకోవచ్చు. అలాగే బ్రిడ్జిపై నిలబడి నది మధ్యలో నుంచి నదిని, పరిసర ప్రాంతాలను కూడా చూడవచ్చు. లోయర్, అప్పర్​ వాక్​వేస్​ల నుంచి చేరుకునేలా ఈ బ్రిడ్జిని నిర్మించారు.