
- మణిపూర్ నీటి సరఫరా ప్రాజెక్టులు సరఫరా ప్రారంభించిన మోడీ
- మణిపూర్ మహిళలకు రాఖీ గిఫ్ట్ అన్న ప్రధాని
న్యూఢిల్లీ: కరోనా కారణంగా దేశమేమీ ఆగిపోలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేంత వరకు పోరాటం చేయాల్సిందే అని మోడీ అన్నారు. మణిపూర్‌లో నీటి సరఫరా ప్రాజెక్టులకు వీడియో ద్వారా శంకుస్థాపన చేసిన మోడీ ఈ విషయాలు చెప్పారు. ఈ నీటి సరఫరా కేంద్రాలు మణిపూర్ మహిళలకు రాఖీ గిఫ్ట్ అని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా గ్రేటర్ ఇంఫాల్‌లోని 1700 గ్రమాలకు తాగునీరు అందుతుందని మోడీ అన్నారు. లోకల్ పంచాయతీలు, ప్రజల సహకారంతో ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నామని, డీ సెంట్రలైజేషన్‌కు ఇది నిదర్శనం అని అన్నారు. ఈ వాటర్ సప్లై ప్రాజెక్టులు యువతకు ఉద్యోగాలు సృష్టిస్తాయని మోడీ చెప్పారు. ఈశాన్య భారతదేశం రెండు విషయాల్లో పోరాడుతోందని, ఒకవైపు కరోనా మహమ్మారి, మరోవైపు వరదలతో ఇబ్బందులు పడుతున్నారని, దేశం అంతా మీ వెంటే ఉందని, దిగులు పడాల్సిన అవసరం లేదని మోడీ చెప్పారు.