సొరంగం నుంచి సురక్షితంగా వచ్చిన కార్మికులతో మోదీ ఇంటరాక్షన్

సొరంగం నుంచి సురక్షితంగా వచ్చిన కార్మికులతో మోదీ ఇంటరాక్షన్

ఉత్తరకాశీ సొరంగం నుంచి బయటకు సురక్షితంగా వచ్చిన కార్మికులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. నవంబర్ 12న కొండచరియలు విరిగిపడటంతో సొరంగం ఓ భాగం కూలిపోయింది. ఈ ఘటనలో కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారిని రక్షించేందుకు పెద్దఎత్తున అధికారులు ఆపరేషన్‌ చేపట్టారు. 17 రోజుల తర్వాత వారందరినీ రక్షించడంతో నవంబర్ 28న రాత్రి మిషన్ పురోగతి సాధించింది.

కార్మికులను కాపాడిన వెంటనే, పీఎం మోదీ Xలో ఓ పోస్ట్ చేశారు. ఉత్తరకాశీలో మా కార్మిక సోదరుల రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది. సొరంగంలో చిక్కుకున్న స్నేహితులకు నేను చెప్పాలనుకుంటున్నదేమిటంటే.. మీ ధైర్యం, సహనం అందరికీ స్ఫూర్తినిస్తున్నాయి. మీ అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలా కాలం నిరీక్షణ తర్వాత మా ఈ స్నేహితులు ఇప్పుడు వారి ప్రియమైన వారిని కలుసుకోవడం చాలా సంతృప్తిని కలిగించే విషయం అని మోదీ చెప్పారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి జనరల్ (రిటైర్డ్) వికె సింగ్ 41 మంది కార్మికులను పూలమాలలతో స్వాగతించారు, కరచాలనం చేసి వారిని ఆలింగనం చేసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న రెస్క్యూ టీమ్‌లు, అధికారులు చప్పట్లు కొట్టారు. ఇక సొరంగంలో చిక్కుకుని, ఇన్ని రోజుల తర్వాత బయటికి రావడంతో, కొందరు చిరునవ్వుతో, మరికొందరు కృతజ్ఞతతో అలసిపోయిన ముఖాలతో కనిపించారు. రోజుల తరబడి అనిశ్చితి తర్వాత తమతో ఒక్కటవ్వడంతో ఆ ప్రాంతంలో క్యాంపింగ్‌లో ఉన్న బంధువులు భావోద్వేగానికి గురయ్యారు. కార్మికులను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు అంబులెన్స్ లలో తీసుకెళ్తున్నపుడు స్థానికులు, ప్రజలు స్వాగతం పలకడంతో పాటు.. బిగ్గరగా చీర్స్, నినాదాలు చేస్తూ కనిపించారు.

దేవుడు ఫైనల్ గా తమ మాట విన్నాడని, తన సోదరుడిని రక్షించాడని, ఆసుపత్రికి వెళ్లే మార్గంలో నేను అతనితో అంబులెన్స్‌లో ఉన్నానని ఉత్తరకాశీలోని సొరంగం వెలుపల ఉన్న సునీల్ ఉక్కిరిబిక్కిరి అయిన గొంతుతో చెప్పాడు. సొరంగంలో చిక్కుకున్న జార్ఖండ్‌లోని ఖేరాబెరాకు చెందిన ముగ్గురు యువకుల్లో సునీల్ సోదరుడు అనిల్ కూడా ఉన్నాడు. అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని, తాను వారిలో కొందరితో మాట్లాడానని ఒక రెస్క్యూ వర్కర్ చెప్పారు.