లడాఖ్‌లో ప్రధాని మోడీ పర్యటన

లడాఖ్‌లో ప్రధాని మోడీ పర్యటన
  • సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌తో కలిసి పర్యటన

లడాఖ్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లడాఖ్‌లో ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నర్వానేతో కలిసి శుక్రవారం ఉదయం లెహ్‌ చేరుకున్నారు. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ దూకుడు నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టాప్‌ కమాండర్లతో మోడీ సమావేశం కానున్నారు. లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ (ఎల్‌ఏసీ) దగ్గర పరిస్థితులను అడిగి తెలుసుకుంటారు. జూన్‌ 15న గాల్వాన్‌ లోయలో జరిగిన హింసాత్మక ఘటనలో మన సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మోడీ వారిని పరామర్శించారు. ఇప్పుడు లెహ్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌ వెస్ట్రన్‌ సెక్టార్‌‌లో పర్యటిస్తారని అధికారులు చెప్పారు. ఈ మేరకు లెఫ్టినెంట్‌ జనరల్‌, మరికొంత మంది ఆర్మీ అధికారులతో భేటీ అయి పరిస్థితిని సమీక్షిస్తారని అధికారులు చెప్పారు.