రైల్వే నెట్ వర్క్ విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం : మోదీ

 రైల్వే నెట్ వర్క్ విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం : మోదీ

రైల్వే నెట్ వర్క్ విస్తరణకు కేంద్రం అధిక ప్రాధాన్యత  ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమృత్ భారత్ పధకం కింద రూ.25 వేల కోట్ల నిధులతో దేశంలోని 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి వర్చువల్ గా మోదీ శంకుస్థాపన చేశారు. దేశ రైల్వే రంగంలో ఇవాళ  చరిత్రలో నిలిచిపోయే రోజని ఆయన అభిప్రాయయపడ్డారు. 

రైల్వేలో  మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించామని మోదీ చెప్పుకొచ్చారు.  ఈ ఏడాది బడ్జెట్ లో రైల్వే శాఖకు ఎక్కువగా నిధులు కేటాయించామని వెల్లడించారు. సామాన్యుల కోసమే రైల్వే అభివృద్ధి చేస్తున్నామని మోదీ తెలిపారు.   గత 9 ఏళ్లుగా రైల్వే లైన్లను విస్తరించామని చెప్పుకొచ్చారు.  అమృత్ భారత్ పధకం కింద తెలంగాణ రూ.894.09 కోట్లతో 21 స్టేషన్లు, ఏపీలో 453.50 కోట్లతో 18 స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

తొలి దశలో అభివృద్ధి చేసే స్టేషన్లు ఇవే 

తెలంగాణ: ఆదిలాబాద్‌, భద్రాచలం రోడ్‌, హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్‌, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, కాజీపేట, ఖమ్మం, మధిర, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, మలక్‌పేట, మల్కాజిగిరి, నిజామాబాద్‌, రామగుండం, తాండూరు, యాదాద్రి (రాయగిరి), జహీరాబాద్‌.

ఆంధ్రప్రదేశ్‌: పలాస, విజయనగరం, అనకాపల్లి, దువ్వాడ, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తెనాలి, రేపల్లె, పిడుగురాళ్ల, కర్నూలు, కాకినాడ టౌన్‌, ఏలూరు, తుని, ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ.