1.25కోట్ల వలస కూలీల ఉపాధి కల్పించే క్యాంపైన్‌ లాంచ్‌ చేసిన మోడీ

1.25కోట్ల వలస కూలీల ఉపాధి కల్పించే క్యాంపైన్‌ లాంచ్‌ చేసిన మోడీ
  • ఆత్మ నిర్భర‌ ఉత్తర్‌‌ప్రదేశ్‌ రోజ్‌ఘర్‌‌ అభియాన్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా ఉపాధి కోల్పోయి ఇళ్లకు చేరుకున్న వలస కూలీలు, ఉద్యోగాలు కోల్పోయిన వారికి హెల్ప్‌ చేసేందుకు ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర ఉత్తర్‌‌ ప్రదేశ్‌ అభియాన్‌ క్యాంపైన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని 31 జిల్లాలోని వలస కూలీలకు దీని ద్వారా పనులు దొరకనున్నాయి. ఢిల్లీ నుంచి వీడియో ద్వారా మోడీ దీన్ని ప్రారంభించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూన్‌ 20న ప్రధాని మోడీ ప్రారంభించిన గరీభ్‌ కల్యాణ్‌ రోజ్‌గర్‌‌ అభియాన్‌లో భాగంగా దీన్ని స్టార్ట్‌ చేశారు. గరీభ్‌ కల్యాణ్‌రోజ్‌గర్‌‌ యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో దీన్ని అమలు చేయనున్నారు. ఆత్మ నిర్భర్‌‌ యూపీ రోజ్‌గర్‌‌ అభియాన్‌ ద్వారా లోకల్‌ ఎంటర్‌‌ప్రెన్యూర్‌‌ షిప్‌ను ప్రమోట్‌ చేసి, ఇండస్ట్రియల్‌ అసోసియేషన్స్‌తో పార్టనర్‌‌షిప్‌ క్రియేట్‌ చేసి ఎంప్లాయ్‌మెంట్‌ జనరేట్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని అధికారులు చెప్పారు. 25 కేటగిరీల్లో ఉద్యోగాలు ఇవ్వాలని వివిధ డిపార్ట్‌మెంట్లకు టార్గెట్‌ ఇచ్చామని అన్నారు.