మోడీ డిజిటల్ మిషన్.. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ఐడీ

మోడీ డిజిటల్ మిషన్.. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ఐడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. టెక్నాలజీ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ స్కీమ్ ను మొదలు పెడుతున్నట్లు ప్రధాని మంత్రిత్వ కార్యాలయం (పీఎంవో) తెలిపింది. ఈ పథకం కింద ప్రతి పౌరుడికీ ప్రత్యేక హెల్త్ ఐడీ కేటాయిస్తారు. ఆ హెల్త్ ఐడీలో సదరు వ్యక్తికి సంబంధించిన హెల్త్ సమాచారాన్ని పొందుపరుస్తారు. ఈ పథకం గురించి మోడీ మాట్లాడుతూ.. గత ఏడు సంవత్సరాల్లో దేశంలో ఆరోగ్య రంగంలో సౌకర్యాలను బలోపేతం చేసే ప్రచారం నేటి నుంచి కొత్త దశలోకి ప్రవేశిస్తోందన్నారు. భారత దేశంలో ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మకమైన శక్తి కలిగిన ఒక మిషన్ ఈరోజు ప్రారంభమవుతుందన్నారు.

ఆస్పత్రుల అనుసంధానం 
'ఆయుష్మాన్ భారత్ పథకం పేదల జీవితంలోని గొప్ప ఆందోళనను తొలగించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగా దేశ ప్రజలు ఉచిత చికిత్స సదుపాయాన్ని పొందారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు డిజిటల్ అయి ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడతాయు. దీని కింద, దేశ ప్రజలు డిజిటల్ హెల్త్ ఐడీని పొందుతారు. ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డు డిజిటల్‌గా రక్షించబడుతుంది. భారతదేశ ఆరోగ్య రంగాన్ని మార్చడానికి వైద్యవిద్యలో అపూర్వమైన సంస్కరణలు కూడా జరుగుతున్నాయి. ఈ ఏడెనిమిది ఏళ్లలో మునుపెన్నడూ లేనంత ఎక్కువ మంది వైద్యులు, పారామెడికల్ మానవశక్తి ఇప్పుడు దేశంలో తయారవుతోంది. ఆరోగ్య రంగానికి టూరిజంతో చాలా బలమైన సంబంధం ఉంది. మన దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు సమగ్రమైనప్పుడు, బలోపేతం అయినప్పుడు అది పర్యాటక రంగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది' అని మోడీ స్పష్టం చేశారు.

కొవిన్ పాత్ర కీలకం: ప్రధాని మోడీ
మన దేశంలో 130 కోట్ల ఆధార్ నంబర్లు, 118 కోట్ల మొబైల్ సబ్‌స్క్రైబర్లు, దాదాపు 80 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు, 43 కోట్ల జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. ప్రపంచంలో ఇంత పెద్ద మౌలిక సదుపాయాలు ఏ దేశంలో ఎక్కడా లేవు. ఈ డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా పరిపాలన నుంచి రేషన్ వరకు సాధారణ భారతీయుడికి వేగంగా, పారదర్శకంగా అందుతున్నాయి. కరోనా సంక్రమణ వ్యాప్తిని నివారించడంలో ఆరోగ్య సేతు యాప్ చాలా సహాయపడింది. ప్రతి ఒక్కరికీ టీకా, ఉచిత వ్యాక్సిన్ ప్రచారం కింద దేశంలో ఈ రోజు సుమారు 90 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇవ్వగలిగాం. ఇందులో కొవిన్ యాప్ పాత్ర ఎంతో ఉంది.

For More News..

రైతుల నిరసనలంటే దోపిడీ ప్రభుత్వానికి నచ్చట్లే

 

అసెంబ్లీ ముందు ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం

రాబోయే మూడు గంటల్లో భారీ వర్షాలు