వలస కూలీల కోసం గరీబ్‌ కల్యాన్‌ రోజ్‌గర్‌‌ అభియాన్‌

వలస కూలీల కోసం గరీబ్‌ కల్యాన్‌ రోజ్‌గర్‌‌ అభియాన్‌
  • రూ.50వేల కోట్లతో ప్రారంభించిన మోడీ
  • సొంత ఊళ్లలోనే ఉపాధి కల్పించే విధంగా

న్యూఢిల్లీ: వలస కూలీల కోసం మోడీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సొంతూళ్లలోనే పనులు చేసుకునే విధంగా ‘గరీభ్‌ కల్యాణ్‌ రోజ్‌గర్‌‌ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. బీహార్‌‌లోని ఖగరియా జిల్లా తెలిహార్‌‌ గ్రామంలో ప్రధాని మోడీ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దీన్ని స్టార్ట్‌ చేశారు. రూ.50వేల కోట్లతో ప్రారంభించారు. “ వలస కూలీలకు ఇక నుంచి వారి సొంత ఊళ్లలోనే ఉద్యోగాలు ఉంటాయి. సీటీలను డవలప్‌ చేసేందుకు ఉపయోగించిన మీ టాలెంట్‌ ఇక నుంచి మీ సొంత గ్రామాలు, చుట్టు పక్కల గ్రామాలు డవలప్‌ చేసేందుకు ఉపయోగించండి. బీహార్‌‌లో స్టార్ట్‌ చేసిన ఈ కార్యక్రమం ఇళ్ల దగ్గరే పనులు ఉంటాయి” అని మోడీ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా బీహార్‌‌, ఉత్తర్‌‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒడిశా, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. దీని కోసం 25 రకాల పనులను గుర్తించారు. ఈ పథకం ద్వారా 125 రోజుల పాటు కార్మికులకు పని కల్పిస్తారు. ఈ పథకం ద్వారా దాదాపు 25 వేల మంది కార్మికులు దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మోడీ వలస కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వలస కూలీలను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోర్డర్‌‌లో అమరులైన వారికి నివాళులర్పించారు. వారంతా బీహార్‌‌ రెజిమెంట్‌కు చెందిన వారే అని గుర్తు చేసుకున్నారు.