అక్టోబర్ 10న ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభం

అక్టోబర్ 10న  ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభం

జనగామ అర్బన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రధాన మంత్రి ధన్​ ధాన్య కృషి యోజనను నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారని, ఈ పథకానికి జనగామ జిల్లా ఎంపిక అయ్యిందని జనగామ కలెక్టర్​రిజ్వాన్​ భాషా షేక్ తెలిపారు. కృషి యోజన పథకాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించనున్న సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి శుక్రవారం కలెక్టరేట్ లో వ్యవసాయ, గ్రామీణాభివృద్ది, మత్స్య, కోఆపరేటివ్​ తదితర శాఖల అధికారులతో గూగుల్​మీటింగ్​నిర్వహించి ఆదేశాలను జారీ చేశారు. పేదలు, యువత, రైతులు, మహిళల జీవితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పీఎండీడీకేవై పథకం దోహదపడుతుందన్నారు.

 వచ్చే 6 సంవత్సరాల వరకు అమలయ్యే ఈ పథకం లో భాగంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టే వివిధ రకాల కార్యకలాపాలకు సంబంధించిన యాక్షన్​ ప్లాన్​ ను రూపొందిస్తున్నామన్నారు. నేడు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ప్రజాప్రతినిధులకు, రైతులకు, స్వయం సహాయక సభ్యులకు  సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం అంగన్​వాడీ కేంద్రాల నిర్వహణ, పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. క్లస్టర్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అంగన్​వాడీ కేంద్రాల పనితీరు మెరుగు పర్చేందుకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.