రెండ్రోజుల జపాన్ పర్యటనలో భాగంగా.. NEC కార్పొరేషన్ ఛైర్మన్ నోబుహిరో ఎండోతో సమావేశమయ్యారు ప్రధాని మోడీ. టెలీ కమ్యూనికేషన్ రంగంలో ఎన్ఈసీ పాత్రను ప్రశంచించారు ప్రధాని మోడీ. భారత్ లో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల గురించి NEC ఛైర్మన్ తో మోడీ చర్చించినట్లు తెలిపింది విదేశాంగ శాఖ. యూనిక్లో సీఈవో తదాషి యానే తో టెక్స్ టైల్ మార్కెట్, టెక్స్ టైల్ ప్రాజెక్టుల కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద.. పెట్టుబడి అవకాశల గురించి చర్చించారు. సుజుకి మోటర్ కార్పొరేషన్ సలహాదారు ఒసామ్ సుజుకీ, సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ మసయోషి సన్ లతో సమావేశమయ్యారు. 2022, మే 24వ తేదీ మంగళవారం క్వాడ్ సమ్మిట్ లో పాల్గొననున్నారు.
PM @narendramodi met Mr. Nobuhiro Endo, the Chairman of NEC Corporation. Mr. Endo spoke about opportunities in India in areas such as smart cities, emerging technologies and an innovative effort to encourage learning of Japanese in India. pic.twitter.com/UJ4H4R0OOM
— PMO India (@PMOIndia) May 23, 2022
ఇదిలా ఉంటే.. జపాన్ రాజధాని టోక్యోలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. మోడీ స్టే చేయనున్న హోటల్ న్యూ ఒటానీ దగ్గర మోడీ.. మోడీ.. భారత్ మాతాకీ జై అంటూ ప్రవాస భారతీయులు నినాదాలు చేశారు వివిధ బాషల్లో స్వాగతం అని రాసిన ప్లకార్డులు పట్టుకుని మోడీకి స్వాగతం పలికారు చిన్నారులు.. జపాన్ కు స్వాగతం.. దయచేసి మీ ఆటోగ్రాఫ్ ఇవ్వడిం అని రిత్సుకీ కొబయాషి.. ప్రధాని మోడీని హిందీలో అడిగాడు. ఆ బాలుడ్ని మోడీ ప్రశంసించారు. అక్కడున్న జపాన్ విద్యార్థులకు మోడీ ఆటోగ్రాఫ్ ఇచ్చారు.
మరింత సమాచారం కోసం : -
జపాన్ లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం
ఛత్తీస్గఢ్లో అంగన్ వాడీ వర్కర్ల కష్టాలు
