PM Modi tweet: హిందువులకు రక్షణ కల్పించండి: మహమ్మద్ యూనస్తో ప్రధాని మోదీ

PM Modi tweet: హిందువులకు రక్షణ కల్పించండి: మహమ్మద్ యూనస్తో ప్రధాని మోదీ

ఢిల్లీ: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మహమ్మద్ యూనస్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో మహమ్మద్ యూనస్ను విష్ చేశారు. ‘‘బంగ్లాదేశ్లో కొత్తగా బాధ్యతలు భుజానికెత్తుకున్న  ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్కు నా శుభాకాంక్షలు. బంగ్లాదేశ్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు ఉంటాయని ఆశిస్తున్నాను. హిందువులతో పాటు మైనారిటీ వర్గాలకు రక్షణ కల్పి్స్తారని ఆశిస్తున్నాను. బంగ్లాదేశ్తో దౌత్యపరంగా కలిసి ముందుకు వెళ్లడానికి, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, శాంతిభద్రతలను పరిరక్షించడానికి భారత్ ఇప్పటికీ సంసిద్ధంగా ఉంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.

 

బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఇటీవల ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేశారు. అనంతరం మహమ్మద్ యూనస్ ను తాత్కాలిక ప్రధానిగా నియమించారు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్. కొత్త ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న సమయంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి సైనిక పాలన సాగుతోంది. నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆగస్టు 8, 2024  గురువారం రాత్రి ప్రమాణస్వీకారం చేసింది.

ఆర్థికవేత్త , బ్యాంకర్ అయిన యూనస్ మైక్రోక్రెడిట్ మార్కెట్‌లను అభివృద్ధి చేసినందుకు 2006 నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. అతను 1983లో స్థాపించిన గ్రామీణ బ్యాంకు ద్వారా వేలాది మంది పేదరికం నుంచి బయటపడేందుకు సాధారణ బ్యాంకు రుణాలకు అర్హత లేని వ్యాపారవేత్తలకు చిన్నపాటి రుణాలను అందించినందుకు ప్రశంసలు అందుకున్నారు.

ఇటీవల షేక్ హసీనాప్రభుత్వం తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే.2009 నుంచి అధికారంలో ఉన్న 76 ఏళ్ల హసీనా..ఢాకా వీధుల్లోకి రావాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది ప్రజలు తరలిరావడంతో సోమవారం రాజీనామా చేశారు. గత నెలరోజులుగా బంగ్లాదేశ్ లో అశాంతి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న కుటుంబాలకు రిజర్వేషన్ తొలగించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.క్రమంగా హసీనా వ్యతిరేక ఉద్యమంగా మారింది. 

జనవరి ఎన్నికలలో రిగ్గింగ్, విస్తృతంగా మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొన్న హసీనా, నిరసనలను అరికట్టడానికి భద్రతా దళాలను మోహరించారు.  అణిచివేతలో వందలాది మంది మరణించారు. అయితే దేశంలో నిరసనలు హింసాకాండగా మారటంతో సైన్యం కూడా హసీనాకు వ్యతిరేకంగా మారింది , ఆమె పొరుగున ఉన్న భారతదేశానికి హెలికాప్టర్‌లో పారిపోవాల్సి వచ్చింది.