Peddi : రామ్ చరణ్ 'పెద్ది'లో శివ రాజ్‌కుమార్ 'గౌర్ నాయుడు'గా ఎంట్రీ.. అభిమానులకు పండుగే!

Peddi :  రామ్ చరణ్ 'పెద్ది'లో శివ రాజ్‌కుమార్ 'గౌర్ నాయుడు'గా ఎంట్రీ.. అభిమానులకు పండుగే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'పెద్ది' (Peddi) . ఈ మూవీపై రోజురోజుకు భారీగానే అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఒక కొత్త అప్‌డేట్ అభిమానులను మూవీ మేకర్స్ అదించింది.  కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) పుట్టినరోజు సందర్భంగా, చిత్ర యూనిట్ ఆయన పాత్ర పేరు , లుక్‌ను విడుదల చేసింది. ఇది సినిమాపై ఉన్న ఆసక్తిని పతాక స్థాయికి చేర్చింది. శివరాజ్ కుమార్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

'గౌర్ నాయుడు'గా శివ రాజ్‌కుమార్.. 
'పెద్ది' చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన వృధ్ధి సినిమాస్ తమ X  అకౌంట్ ద్వారా ఈ శుభవార్తను పంచుకుంది. 'కరుణాడ చక్రవర్తి' @NimmaShivanna గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పెద్ది టీం తెలియజేసింది.  'గౌర్ నాయుడు' పాత్ర పెద్ద తెరలపై రాజసంగా, పేలుడుగా ఉంటుంది.  ప్రపంచ వ్యాప్తంగా 'పెద్ది' మూవీని 27 మార్చి, 2026"న రిలీజ్ చేస్తున్నట్లు ట్వీట్ చేసింది. శివ రాజ్‌కుమార్ 'గౌర్ నాయుడు' లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఆయన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను ఇది స్పష్టం చేస్తోంది. ఒక భారీ యాక్షన్ చిత్రంలో శివ రాజ్‌కుమార్ లాంటి స్టార్ నటుడు చేరడం సినిమాకు మరింత బలం చేకూరుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు..

ALSO READ : 'బాహుబలి' దశాబ్ది వేడుక: రాజమౌళి, ప్రభాస్, రానా అద్భుత కలయిక.. అనుష్క, తమన్నా డుమ్మా!

 

ఊహించని స్పోర్ట్స్ డ్రామాకు మించి!
'పెద్ది' చిత్రం కేవలం ఒక క్రికెట్ ,  స్పోర్ట్స్ డ్రామాకు మించి ఉంటుందని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. టైటిల్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచీ, ఈ సినిమా అంచనాలు అంతకంతపె పెరుగుతున్నాయి.. విస్తృతమైన కథా పరిధిని కలిగి ఉన్న ఈ చిత్రం, పెద్ద తెరపై చూడటానికి విందుగా ఉంటుందని మూవీ టీం ధీమా వ్యక్తం చేసింది.  దర్శకుడు బుచ్చిబాబు సానా కథను అద్భుతంగా తీర్చిదిద్దారని, ఇది ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు వృధ్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్,  సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నాయి. ఈ భారీ కలయిక సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది.

భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, హై-క్వాలిటీ టెక్నికల్ టీమ్!
నిర్మాణ పనులు షెడ్యూల్ ప్రకారం వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ చిత్రంలో "భయంకరమైన నైట్ యాక్షన్ సీక్వెన్స్, గ్రిట్టి విజువల్స్‌తో" చిత్రీకరణను పూర్తి చేసినట్లు తెలుస్తోంది . సినిమా యూనిట్ ఇప్పటికే ఇండియన్  సినిమాలో మునుపెన్నడూ చూడని "ఫస్ట్-ఆఫ్-ఇట్స్-కైండ్" ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించిందని సినీ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో ఈ అద్భుతమైన ట్రైన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. ఈ సన్నివేశం భారతీయ సినిమాలో గతంలో చూడని విధంగా ఉంటుందని, యాక్షన్ ఫిల్మ్‌మేకింగ్‌కు కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని వర్గాలు చెబుతున్నాయి.

రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్‌తో పాటు, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గెలుచుకున్న టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 'పెద్ది' ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.  ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.