
కాంగ్రెస్ హయాంలోనే టూరిజం డెవ్ లప్ మెంట్ జరుగుతోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి వివేక్, కొండా సురేఖ, ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్.. కాంగ్రెస్ టెంపుల్ టూరిజాన్ని అభివృధి చేస్తోందన్నారు. పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలని తల్లిదండ్రులు సరస్వతీ అమ్మవారికి పూజలు నిర్వహిస్తారని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ కూడ విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎంపీ ఎక్కువ నిధులు తీసుకురావాలని సూచించారు.
త్వరలోనే కనీస వేతనాలు పెంచుతామన్నారు వివేక్. ఇది కార్మికులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. త్వరలో గిగ్ పాలసీ తీసుకొస్తామని..ఈ పాలసీ వర్కర్లకు భద్రతనిస్తుందన్నారు. ప్రభుత్వానికి అప్పులు భారంగా మారినా.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు వివేక్. పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు.
►ALSO READ | ఏ పార్టీలో ఉండి మాట్లాడుతున్నవ్.. బీఆర్ఎస్ లో ఉన్న దెయ్యాలు ఎక్కడికెళ్లినయ్
మంత్రి వివేక్ వెంకటస్వామి కొండాసురేఖ కలిసి బాసరలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. బాసర ఆలలయ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రూ. 9 కోట్ల రూపాయలతో మరమ్మత్తులు చేపట్టిన 100 పడకల వసతి గృహం, రూ. 3.47 కోతో నూతనంగా నిర్మించిన బాసర ఆలయ అడ్మినిస్ట్రేషన్ భవనాన్ని ప్రారంభించారు మంత్రులు.