
కవిత ఏ పార్టీలో ఉండి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్. బీఆర్ఎస్ లో ఉన్న దెయ్యాలు ఎక్కడికెళ్లాయో కవిత చెప్పాలన్నారు. కాంగ్రెస్ చేసిన పనిని కవిత తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందన్నారు.పదేళ్లు అధికారంలో ఉన్న కవిత బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు మహేశ్ కుమార్ .
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీ కోటా పెంచామన్నారు మహేశ్ కుమార్. 42 శాతం రిజర్వేషన్ పై కాంగ్రెస్ చారిత్రాత్మ క నిర్ణయం తీసుకుందన్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. ఎవరెన్ని చెప్పినా.. బీసీ కోటా విషయంలో కాంగ్రెస్ చాంపియన్ అని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీలను మోసం చేసిందని విమర్శించారు. బీసీ కోటాపై విపక్షాలు కలిసి రావాలన్నారు. బీసీ కోటాపై ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో చ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు మహేశ్ కుమార్.
►ALSO READ | ఎరువులు, రసాయనాల వాడకం తగ్గించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం-–2018కి సవరణలు చేయాలని, త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు మండలం యూనిట్ గా.. ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు జిల్లా యూనిట్ గా.. జెడ్పీ చైర్పర్సన్లకు రాష్ట్రం యూనిట్ గా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.