చంద్రయాన్​ 3 సక్సెస్​ డే ని(ఆగస్టు 23) నేషనల్​ స్పేస్​ డేగా జరుపుకుందాం: మోదీ

చంద్రయాన్​ 3 సక్సెస్​ డే ని(ఆగస్టు 23) నేషనల్​ స్పేస్​ డేగా జరుపుకుందాం: మోదీ
  • నేను విదేశీ పర్యటనలో ఉన్నా మనసంతా ఇక్కడే ఉంది
  • అనుక్షణం ఆసక్తిగా ఎదురు చూశా
  • కష్టానికి తగిన ఫలితం లభించింది
  • భారత్​ కీర్తి విశ్వవ్యాపితమైంది
  • సైంటిస్టుల ధైర్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్: ప్రధాని

దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చంద్రయాన్​ 3 మిషన్ సక్సెస్ లో ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదని ప్రధాని మోదీ కొనియాడారు. చంద్రయాన్​3 సక్సెస్​ అయిన ఆగస్టు 23వ తేదీని​ నేషనల్ ​స్పేస్​ డేగా ప్రకటించారు. మూన్​పై  ల్యాండర్ ​దిగిన ప్రాంతానికి 'శివ శక్తి' గా నామకరణం చేశారు. చంద్రయాన్​ 2 వెళ్లిన చోటుకు తిరంగా పాయింట్ గా ఆయన నామకరణం చేశారు. చంద్రయాన్​ 3 సక్సెస్​లో నారీ శక్తి ఎంతో ఉందని కొనియాడారు.

ఆగస్టు 26 ఆయన బెంగళూరులోని ఇస్రో సెంటర్​కి వెళ్లి శాస్త్రవేత్తలను అభినందించారు మోదీ. చంద్రయాన్ ​3 సక్సెస్​ కావడానికి కారణమైన సైంటిస్టులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ... ప్రపంచానికి వెలుగులు అందించే శక్తి భారత్​కి ఉందని అన్నారు. తాను సౌతాఫ్రికాలో ఉన్నా మనసంతా ఇండియాలోనే ఉందని చెప్పారు. చంద్రయాన్​ 3 ప్రయోగం జరుగుతున్నటి నుంచి ప్రతిక్షణం ఆసక్తిగా గమనించినట్లు చెప్పారు. 

సైంటిస్టుల కష్టానికి, శ్రమకు, అంకితభావానికి సెల్యూట్​ చేస్తున్నట్లు చెప్పారు. విక్రమ్ ల్యాడర్, ప్రగ్యాన్​రోవర్​ విరోచిత పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. భారత్ ​సైంటిఫిక్​స్ఫూర్తికి, టెక్నాలజీకి ఈ ప్రయోగం అద్దంపట్టిందని స్పష్టం చేశారు. ఈ విజయం మానవాళికి ఉపయోగపడేదని రానున్న రోజుల్లో భారత్​ వైజ్ఞానిక రంగంలో దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

గ్రీస్​పర్యటన అనంతరం ఆయన నేరుగా బెంగళూరుకు చేరుకుని ఇస్రో సెంటర్​కి వెళ్లారు. అక్కడికి వెళ్లిన అనంతరం ఇస్రో చీఫ్, డైరెక్టర్లను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్​ నినాదం చేశారు. 

అంతకు ముందు రోవర్​ చంద్రుడిపై ల్యాండ్​ అయిన దృశ్యాలను సైంటిస్టులు చూపించి వివరించారు. చంద్రుడిపై రోవర్​ దిగిన దృశ్యాల తాలూకు ఫొటోలను మోదీకి అందించారు.