
తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలయ్యింది. ఇప్పటికే సభలు, సమావేశాలతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తుండగా.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో ప్రచారం చేస్తుంది. ఇక తెలంగాణ బీజేపీ ప్రచారంలొ దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యింది.
ఇందులో భాగంగానే స్వయంగా ప్రధాని మోడీ రంగంలోకి దిగుతున్నారు. మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు అక్టోబర్ 2న మోడీ మహబూబ్ నగర్ లో భారీ బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల శంఖారావాన్ని మోగించనున్నారు మోడీ.
Also Read :- ఎన్డీయేలో చేరిన జేడీఎస్
ఇప్పటికే బీజేపీ నుంచి పోటీచేసేందుకు ఆశా వాహులు అప్లై చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగానే తెలంగాణలో బహిరంగ సభలతో పాటు అభ్యర్థులను కూడా ప్రకటించడానికి రంగం సిద్ధం చేస్తోంది. మోడీ సభల తర్వాత రాష్ట్రంలో మరో రెండు ఉమ్మడి జిల్లాల్లో నడ్డా, అమిత్ షా సభలకు ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర నేతలు.