స్థిరమైన ప్రభుత్వం వల్లే వేగంగా అభివృద్ధి మాటిస్తే నెరవేరుస్త: మోదీ

స్థిరమైన ప్రభుత్వం వల్లే వేగంగా అభివృద్ధి మాటిస్తే నెరవేరుస్త: మోదీ

మేహ్‌‌సనా(గుజరాత్): దేశంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందంటూ ప్రపంచవ్యాప్తం గా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజాబలంతో ఏర్పడి న స్థిరమైన ప్రభుత్వంతోనే ఇది సాధ్యమవు తోందన్నారు. గుజరాత్‌‌లోని మేహ్‌‌సనా జిల్లాలో ప్రధాని పర్యటించారు. హెలికాప్టర్‌‌‌‌లో అక్కడికి చేరుకున్న ప్రధాని.. ఓపెన్‌‌ కారులో ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. రూ.5,950 కోట్లతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవా లు చేశారు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. 

తాను మాట ఇస్తే నెరవేర్చి తీరుతానని  మోదీ చెప్పారు. గుజరాత్‌‌లో స్థిరమైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి ఎలా మేలు చేశాయో మనం చూస్తున్నామని అన్నారు. ‘‘కొన్నేండ్లుగా భారీ ప్రాజెక్టులు చేపట్టడం, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం, గుజరాత్ వేగంగా అభివృద్ధి చెందడం వెనుక బలమైన పిల్లర్లు ఉన్నాయని ప్రజలకు బాగా తెలుసు. మీకు నేను నరేంద్ర భాయ్ గానే తెలుసు. నరేంద్ర భాయ్ ఒకసారి వాగ్దానం చేస్తే.. దాన్ని నెరవేరుస్తాడని మీకు తెలుసు” అని చెప్పారు.