నేరాలను అరికట్టేందుకు కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తున్నామన్న మోడీ

నేరాలను అరికట్టేందుకు కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తున్నామన్న మోడీ

హర్యానాలోని సూరజ్ కుండ్ లో చింతన్ శివిర్ రెండో రోజు కొనసాగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన చింతన్ శివిర్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల సీఎంలు, హోం మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, మనీ లాండరింగ్ వంటి నేరాలు సరిహద్దులు దాటి జరుగుతున్నాయన్నారు. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారని చెప్పారు. నేరాలను అరికట్టేందుకు కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తున్నామని తెలిపారు.
 
5 జీతో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ, ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అందుబాటులో ఉందన్న ప్రధాని...  క్రిమినల్స్ కంటే 10 అడుగులు ముందు ఉండాలని చెప్పారు. అన్ని రాష్ట్రాలు కలిసి పోరాడి నేరాలను అరికట్టాలన్నారు. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ ఒక రాష్ట్రానికే రిస్ట్రిక్ట్ అయింది కాదని, సాంకేతికతను క్రిమినల్స్ మిస్ యూస్ చేస్తున్నారని తెలిపారు. నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు.