పంటలను మద్దతు ధరకే కొంటం.. మరోసారి స్పష్టం చేసిన మోడీ

పంటలను మద్దతు ధరకే కొంటం.. మరోసారి స్పష్టం చేసిన మోడీ

ఆహార భద్రతకు ఇదే ముఖ్యం

మరోసారి స్పష్టంచేసిన ప్రధాని

మండీల్లో ఇన్​ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి

అగ్రి రీఫార్మ్స్​తో మార్కెటే చిన్న రైతుల దగ్గరికి

ఎఫ్ఏవో 75వ వార్షికోత్సవంలో రూ.75 కాయిన్ రిలీజ్

న్యూఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో కొనే విషయంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఎంఎస్పీ, ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయడం.. దేశ ఆహార భద్రతలో ఎంతో ముఖ్యమైన భాగాలని అన్నారు. ‘‘మండీల్లో ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా చేయడం వల్ల ఎంఎస్పీ ద్వారా కొనుగోళ్లు సైంటిఫిక్​గా కొనసాగుతాయి. ఈ మధ్య కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలు.. ప్రపంచ ఆహార భద్రత విషయంలో ఇండియా నిబద్ధతను ప్రతిబింబిస్తాయి” అని తెలిపారు.  ఫుడ్, అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) 75వ వార్షికోత్సవం సందర్భంగా 75 రూపాయల కాయిన్​ ను శుక్రవారం రిలీజ్ చేశారు.

ఆరేండ్లలో రూ.2,500 కోట్లు

‘‘హోల్ సేల్ మండీలు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ(ఏపీఎంసీ)లకు సొంత ఐడెంటిటీ, స్ట్రెంత్ ఉన్నాయి. వాటి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను మెరుగుపరిచేందుకు రూ.2,500 కోట్లను ఆరేండ్లలో ఖర్చు చేశాం. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈనామ్)తో మండీలను కనెక్ట్ చేసేందుకు ఐటీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తున్నాం” అని వివరించారు. ఈ మధ్య తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు వ్యవసాయాన్ని విస్తరించేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తీసుకున్న ప్రధాన చర్యలని అన్నారు. ‘‘గతంలో మండీల్లో అమ్ముకునేందుకు రైతులకు యాక్సెస్ ఉండేది కాదు. దళారులకు అమ్ముకోవాల్సి వచ్చేది. ఇప్పుడు చిన్న రైతుల ముందుకే మార్కెట్ వెళ్తుంది. మంచి రేట్లు దొరుకుతాయి. తద్వారా రైతులకు దళారుల బాధ తప్పుతుంది. వినియోగదారులు లాభం పొందుతారు’’ అని వివరించారు.

అమ్మాయిల కనీస పెళ్లి వయసుపై త్వరలో నిర్ణయం

అమ్మాయిల కనీస పెళ్లి వయసును రివైజ్ చేసే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మోడీ చెప్పారు. ‘‘ఎడ్యుకేషన్​లో ఆడపిల్లల గ్రాస్ ఎన్​రోల్ మెంట్ రేషియో అబ్బాయిల కంటే ఎక్కువగా ఉంది. దేశంలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఆరేండ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే ఇది సాధ్యమైంది” అని చెప్పారు. అమ్మాయిల పెండ్లికి అనువైన వయస్సు ఏదో నిర్ణయించడానికి ఒక ముఖ్యమైన చర్చ జరుగుతోందని తెలిపారు. ఈ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ నుంచి రిపోర్టు రాగానే డెసిషన్ తీసుకుంటామని తెలిపారు.

పోషకాహారలోపం సమస్యపై పోరాడుతున్నాం..

పోషకాహార లోపం సమస్యపై తమ ప్రభుత్వం ఆరేండ్లుగా పోరాడుతోందని మోడీ చెప్పారు. మాల్ న్యూట్రిషన్ సమస్యను ఎదుర్కొనేందుకు సమగ్ర విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ప్రారంభించామని గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద దేశవ్యాప్తంగా 11 కోట్ల టాయిలెట్లను నిర్మించామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ కింద తాగు నీరు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. పేద మహిళలకు రూపాయికే శానిటరీ ప్యాడ్స్ అందజేస్తున్నామని వివరించారు.

17 కొత్త పంటలు

2023ను ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’గా ప్రకటించాలన్న ఇండియా ప్రపోజల్​ను ఎఫ్ఏవో సపోర్టు చేసినందుకు మోడీ థ్యాంక్స్ చెప్పారు. మిల్లెట్స్ ఉత్పత్తిని, వినియోగదారుల డిమాండ్ ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా 8 పంటలకు సంబంధించిన 17 బయో ఫోర్టిఫైడ్ రకాలను మోడీ రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఈ వెరైటీలు అందుబాటులో ఉంటాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

బీహార్‌‌‌‌లో 12 ర్యాలీలకు మోడీ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 12 ర్యాలీల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఈనెల 23న సాసారాం, గయా, భాగల్​పూర్ లలో జరిగే సభల్లో మోడీ పాల్గొంటారని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. 28న దర్భంగా, ముజఫర్​పూర్, పాట్నా ఏరియాల్లో ప్రచారం నిర్వహిస్తారని చెప్పారు. ఇక నవంబర్ 1న చాప్రా, ఈస్ట్ చంపారన్, సమస్తిపూర్​లో, 3న వెస్ట్ చంపారన్, సహర్స, ఫోర్బ్స్​గంజ్ ప్రాంతాల్లో బహిరంగ సభల్లో మాట్లాడుతారని వెల్లడించారు. ఈనెల 28, నవంబర్ 3, 7న మూడు దశల్లో బీహార్​లో ఎన్నికలు జరగనున్నాయి. 10న కౌంటింగ్ నిర్వహిస్తారు.

For More News..

బర్త్ డే పార్టీకి పిలిచి.. ఓయో రూంలో గ్యాంగ్ రేప్ చేసిండ్రు

కరప్షన్‌‌‌‌లో సీఎం కేసీఆర్‌‌‌‌‌దే ఫస్ట్ ప్లేస్

కేసీఆర్ కారును జనం ముంచుతరు