ఆరోగ్య సేతులో క‌రోనా కీల‌క స‌మాచారం

ఆరోగ్య సేతులో క‌రోనా కీల‌క స‌మాచారం

న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు మొబైల్​అప్లికేషన్​ను డౌన్​లోడ్​చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజల్ని కోరారు. ‘కరోనాపై దేశం చేస్తున్న పోరాటంలో ఇదొక ముఖ్యమైన అంశం. టెక్నాలజీని ఉపయోగించుకుందాం. కీలకమైన సమాచారాన్ని అందించడంలో ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది ఉపయోగిస్తే దీని ప్రభావం మరింత పెరుగుతుంది’ అని బుధవారం ట్విట్టర్​లో చెప్పారు.

ఈ అప్లికేషన్​ను ఎక్కడ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవాలో లింక్​లను షేర్​ చేశారు. ఈనెల 2వ తేదీన ఈ అప్లికేషన్​ను ప్రభుత్వం ప్రారంభించింది. కరోనా​బారిన పడే ప్రమాదాన్ని అంచనా వేసేందుకు, వైరస్​సోకిన వ్యక్తికి దూరంగా ఉండేందుకు ఈ అప్లికేషన్ ​ఉపయోగపడుతుంది.