
పాకిస్తాన్ నడిబొడ్డున ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామన్నారు ప్రధాని మోదీ. గ్లోబల్ టెర్రర్ యూనివర్సిటీని కూల్చేశామన్నారు . భారత్ దాడి తట్టుకోలేక పాక్ ప్రపంచం ముందు మోకరిల్లిందన్నారు.. సైన్యం ధైర్య సాహసాలను ప్రపంచం మొత్తం చూసిందన్నారు.
జాతినుద్దేశించి మాట్లాడిన మోదీ.. మన ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచేశారు టెర్రరిస్టులు..దేశ ఆడబిడ్డల నుదుటన సిందూరం తీస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ కు తెలిసొచ్చింది. పాక్ మన మీద దొడ్డి దారిన దాడి చేసింది. మన స్కూళ్లు, ఆలయాలు, గురుద్వారాలపై పాక్ దాడి జేసింది. కలలో కూడా ఊహించని రిప్లై ఇచ్చాం. మూడు రోజుల్లోనే పాక్ కు దిమ్మతిరిగేలా చేశాం. 3 దశాబ్దాలుగా పాక్ లో ఉంటున్న ఉగ్రవాదులను మట్టుబెట్టాం. మే 10 న DGMO లతో కాల్పుల విరమణకు వచ్చింది. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ ను సహించం. అంతకు తగిన రియాక్షన్ ఉంటుంది. మనం నేరుగా పాకిస్తాన్ గుండెలపై దాడి చేశాం. దేశ ప్రజల రక్షణ కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. ఐక్యతే భారతీయుల బలం. మేక్ ఇన్ ఇండియా ఆయుధాలే వాడాం అని మోదీ అన్నారు.
పాకిస్తాన్ కు పీఓకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)ను వదలటం తప్ప గత్యంతరం లేదన్నారు మోదీ. పహల్గాం దాడి తర్వాత మే 7న ఆపరేషన్ సిందూర్ తో సత్తా చూపించామని ఈ సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ సిందూర్ లక్ష్యం నెరవేరిందన్నారు. భారత సైన్యం ధైర్య సాహసాలు చూపించిందని కొనియాడారు. దేశం తరఫున సైన్యానికి ధన్యవాదాలు చెప్తున్నట్లు తెలిపారు. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీసుకుందని, పాక్ లోని టెర్రర్ క్యాంపులతో పాటు ఆర్మీ బేస్ లను ధ్వంస చేశామని చెప్పారు. దేశంలోని అక్కలు, చెళ్లెల్లకు ఆపరేషన్ సిందూర్ అంకితమిస్తున్నట్లు చెప్పారు మోదీ.