ప్రధాని మోదీ మౌనం వీడాలి

ప్రధాని మోదీ మౌనం వీడాలి
  • నారాయణగూడ చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం

బషీర్ బాగ్, వెలుగు: నీట్ అవకతవకలపై ప్రధాని మోదీ స్పందించాలని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్​చేశారు. ఈ మేరకు బుధవారం నారాయణగూడ చౌరస్తాలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి, డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్, పీడీఎస్​యూ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, పీవైఎల్ రాష్ట్ర నాయకుడు కృష్ణ పాల్గొని మాట్లాడారు. 

నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని కోరారు. చలో రాజ్ భవన్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు. భారత్ బంద్ చేస్తామన్నారు.