ఉక్రెయిన్ అధ్యక్షుడికి మోడీ ఫోన్..తాజా పరిస్థితులపై చర్చ

ఉక్రెయిన్ అధ్యక్షుడికి మోడీ ఫోన్..తాజా పరిస్థితులపై  చర్చ

ఉక్రెయిన్ - రష్యా మధ్య శాంతి ప్రయత్నాలకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీకి మోడీ ఫోన్ చేసి.. ఉక్రెయిన్లో తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దౌత్యమార్గం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని..త్వరలో అన్ని పరిస్థితులు సద్దుమణుగుతాయని అన్నారు. తూర్పు యురోపియన్ దేశంలో అణుస్థాపనల భద్రతపై మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని జెలెన్ స్కీని కోరారు. 

పెద్ద సంఖ్యలో సైనిక బలగాలను సమీకరిస్తానని పుతిన్ ప్రకటించిన రెండు వారాల తర్వాత ఇరు దేశాల నాయకులు మాట్లాడుకోవడం విశేషం. తమ దేశానికి ముప్పు వస్తే అణుదాడికి కూడా వెనకాడమని పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. ఉక్రెయిన్ లోని నాలుగు భూభాగాలు తమ దేశంలో విలీనం అయినట్లు ఇటీవలె రష్యా అధ్యక్షుడు ప్రకటించాడు. దీనిపై అమెరికా యూఎన్ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది.