‘భారత్ కీ లక్ష్మి’.. నారీ విజయాలను పంచుకుందాం

‘భారత్ కీ లక్ష్మి’.. నారీ విజయాలను పంచుకుందాం
  • ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు

భారత్ కీ లక్ష్మీ పేరుతో మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో ఆదివారం ఉదయం ఆయన మాట్లాడారు. అమ్మాయిలు సాధించిన విజయాలను పంచుకోవాలని ప్రజలకు సూచించారు. సమాజంలో మార్పు తెచ్చేందుకు పనిచేస్తున్న మహిళల గాథలను హ్యాష్ ట్యాగ్ భారత్ కీ లక్ష్మీ పేరుతో సోషల్ మీడియాలో షేర్ చేయాలని ప్రజలను కోరారు.

ఈ-సిగరెట్లపై భ్రమలు వీడాలి

ఈ-సిగరెట్లను నిషేధించిన విషయం గుర్తు చేశారు ప్రధాని మోడీ. ఈ-సిగరెట్లు ప్రమాదకరం కాదనే భ్రమ ప్రజల్లో ఉందన్నారు మోడీ. వాటివల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. చెడు వ్యసనాల బారిన పడొద్దని యువతకు సూచించారు మోడీ. మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా ఈ ఏడాది అక్టోబరు 2న 130 కోట్ల మంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపేయాలని సంకల్పించుకుని, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.