45 మంది టీచర్లకు జాతీయ అవార్డులు

45 మంది టీచర్లకు జాతీయ అవార్డులు

న్యూఢిల్లీ: ఈ ఏడాది జాతీయ అవార్డు అందుకున్న టీచర్లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. సెప్టెంబర్‌‌‌‌ 5 (సోమవారం) టీచర్స్‌‌ డే సందర్భంగా ప్రధాని వారితో సమావేశం కానున్నట్లు పీఎంవో ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలోని 7 లోక్‌‌ కళ్యాణ్‌‌ మార్గ్‌‌లో ఈ సమావేశం జరగనుందని పేర్కొంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 45 మంది టీచర్లు జాతీయ అవార్డులు అందుకున్నారు.

ఆన్‌‌లైన్‌‌ ద్వారా టీచర్ల ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగింది. ఈ అవార్డులు ప్రజల్లో టీచర్ల గౌరవాన్ని మరింత పెంచుతాయని పీఎంవో పేర్కొంది. కమిట్‌‌మెంట్‌‌, కృషి ద్వారా స్కూల్‌‌ ఎడ్యుకేషన్‌‌ను మెరుగుపర్చడమే కాకుండా, స్టూడెంట్ల జీవితాలను తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర ఎనలేనిదని, అలాంటి టీచర్లను గౌరవించేందుకు టీచర్స్‌‌ డేను జరుపుకుంటామని తెలిపింది.