గురుతేజ్ బహదూర్‌కు మోడీ నివాళులు

గురుతేజ్ బహదూర్‌కు మోడీ నివాళులు

ఢిల్లీలోని సిస్ గంజ్ సాహిబ్‌ను ప్రధాని మోడీ సందర్శించారు. గురుతేజ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా మోడీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  సిక్కు మత గురువు తేజ్ బహదూర్‌కు నివాళులర్పించి.. ఆయన సేవలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. అణగారిన వర్గాలకు తేజ్ బహదూర్ చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా ఆయన గౌరవించబడ్డారని, ఆయన చేసిన త్యాగం చాలామందికి బలాన్ని, ప్రేరణను ఇస్తుందని మోడీ ట్వీట్‌ చేశారు. అయితే ప్రధాని షెడ్యూల్‌లో ఈ పర్యటన లేకపోవడంతో అధికారులు ఎలాంటి బందోబస్తు చేయలేదు. అంతేకాకుండా గురుద్వారాకు వెళ్లే మార్గంలో కూడా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదని అధికార వర్గాలు తెలిపాయి.