కరోనా కట్టడిలో మోడీ చర్యలు క్షమించరానివి

కరోనా కట్టడిలో మోడీ చర్యలు క్షమించరానివి

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ముప్పును పసిగట్టడంలో భారత్ విఫలమైందని ఇంటర్నేషనల్ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ విమర్శించింది. కరోనాను కట్టడి చేయాలంటే మోడీ ప్రభుత్వం తమ తప్పుల నుంచి నేర్చుకొని ముందుకెళ్లాలని లాన్సెట్ శనివారం తన ఎడిటోరియల్‌‌లో సూచించింది. కరోనా మహమ్మారిని అదుపు చేసే విషయంపై బహిరంగ చర్చలు, విమర్శలకు మోడీ తావివ్వకపోవడం దారుణమని.. ఈ విషయంలో ఆయనను క్షమించలేమని మండిపడింది. ‘కరోనా తొలి వేవ్ అనంతర పరిస్థితులను భారత ప్రభుత్వం బాగానే కంట్రోలో చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్-19 టాస్క్‌‌ఫోర్స్.. ఏప్రిల్ నెల వరకు ఒక్కసారి కూడా భేటీ కాలేదు. దీని పరిణామాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. కరోనా క్రైసిస్ రోజురోజుకీ ఎక్కువవతున్నందున ఇప్పటికైనా భారత సర్కార్ మేల్కొని వైరస్ నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలి’ అని లాన్సెట్ పేర్కొంది.