రాజన్నసిరిసిల్ల, వెలుగు:ఈ నెల 10న మోదీ రాకతో తెలంగాణ దిశ మారుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ తెలిపారు. ఆదివారం ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. బీజేపీ 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ సభను సక్సెస్ చేయాలన్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, జిల్లా ఇన్చార్జి గంగాడి మోహన్ రెడ్డి, వికాస్ రావు, శీలం రాజు, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
జగిత్యాల టౌన్: ఈ నెల 10న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగే మోదీ భారీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా ఆఫీస్లో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, అటు బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతర్గతంగా ఒప్పందం చేసుకున్నాయని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, జగిత్యాల ఇన్చార్జి శ్రావణి, సురేందర్ రెడ్డి, అనుఫ్ రావు, అరుణ, శ్రీనివాస్, తిరుపతి, భూమి రమణ పాల్గొన్నారు.
