Parliament Winter Session: కేంద్రమంత్రులతో ప్రధాని సమావేశం

Parliament Winter Session: కేంద్రమంత్రులతో ప్రధాని సమావేశం

ప్రధాని నరేంద్ర మోడీ సీనియర్ కేంద్రమంత్రులతో సమావేశం నిర్వహించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్రమంత్రులు పియూష్ గోయల్, ప్రహ్లద్ జోషితో మోడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధాని కేంద్రమంత్రులతో చర్చించారు. ఈనెల 23 వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. అయితే ఈ శీతాకాల సమవేశాల్లో ఇంతవరకు కూడా సభ సజావుగా కొనసాగలేదు. ప్రతిపక్షల నిరసనలు, ఆందోళనతో సభ ప్రారంభమైన కాసేపటికే వాయిదే పడే పరిస్థితి నెలకొంది. ఈసారి జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రధానంగా లఖీంపూర్ ఖేరి ఘటనతో కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్ర రాజీనామాకు డిమాండ్ చేేశారు. దీంతో పాటు.. రైతులకు కనీస మద్దతు ధర, రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ పై ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి:

ఒమిక్రాన్ పేషంట్ కు సీరియస్

వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి.. బూస్టర్ డోసు తప్పనిసరి