వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి.. బూస్టర్ డోసు తప్పనిసరి

వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి.. బూస్టర్ డోసు తప్పనిసరి

వాషింగ్టన్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచమంతటా వేగంగా వ్యాపిస్తోందని యూఎస్ ప్యాండమిక్ అడ్వయిజర్ ఆంథోని ఫౌచీ అన్నారు. అమెరికాలో అర్హులైన ఎంతోమంది ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదని, ఇది ప్రధాన సమస్యగా మారుతోందన్నారు. చలికాలంలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని, దీనిపై ప్రజల్ని హెచ్చరించేందుకు ప్రెసిండ్ జో బైడెన్ యోచిస్తున్నారని చెప్పారు. వ్యాక్సినేషన్ పూర్తయిన వారు ఎయిర్ పోర్ట్ లతోపాటు రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని సూచించారు. ఒమిక్రాన్ కు అసాధారణ రీతిలో వ్యాపించే శక్తి ఉందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పకుండా టీకా వేయించుకోవాలని కోరారు. అలాగే ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తయిన వారు బూస్టర్ డోసు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరులో సమష్టిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే కొన్ని వారాలు, శీతాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారు. 

మరిన్ని వార్తల కోసం: 

ట్రబులిచ్చిందని కారును పేల్చేసిండు

ఇంట్లోనే తయారు చేసుకునే నేచురల్ టోనర్స్

ఏడాదిలోపు బండి కొంటరట!