
ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన కొనసాగుతుంది. మోడీ ఒకేరోజు మూడు సిటీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భారత వాయుసేన ప్రత్యేక విమానంలో శామీర్‌పేట్ మండలంలోని హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోడీకి ప్రభుత్వం తరుపున సీఎస్ సోమేష్ కుమార్ , డీజీపీ మహేందర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ మండలం తుర్కపల్లిలోని జెనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవ్యాక్సిన్ ఉత్పత్తి యూనిట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ ప్రతినిధులతో ప్రధాని మోడీ కరోనా వ్యాక్సిన్ గురించి చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఆ చర్చలు కొనసాగుతున్నాయి.